మహీంద్రా అర్జున్ 605 DI MS V1 ట్రాక్టర్
మహీంద్రా అర్జున్ 605 డీఐ ఎమ్ఎస్ వీ1ని సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. ఇది మీరు వ్యవసాయం చేసే విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు రూపొందిన శక్తివంతమైన, నమ్మదగిన ట్రాక్టర్. ఈ వినూత్నమైన మెషీన్ ఓ గేమ్-ఛేంజర్ కానుంది, ఇది మునుపెన్నడూ లేని పనితీరును, మన్నికను అందిస్తుంది. 36.3 kW (48.7 HP) ఇంజిన్ పవర్‌తో వస్తున్న ఈ మహీంద్రా అర్జున్ 605 డిఐ ఎమ్ఎస్ వి1 ట్రాక్టర్, పొలంలో ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు అనుకున్న సమయంలో తప్పకుండా పని పూర్తిచేసేలా చూసుకుంటుంది. దీని దృఢమైన నిర్మాణం వల్ల మీ వ్యవసాయ పనుల్లో నమ్మకమైన తోడుగా నిలుస్తుంది. దున్నడం నుండి పంట కోత వరకు, ఈ ట్రాక్టర్ అద్భుతాలు చేస్తుంది, అడుగడుగునా అసాధారణమైన పనితీరును అందిస్తుంది. మహీంద్రా అర్జున్ 605 డిఐ ఎమ్ఎస్ వి1 ట్రాక్టర్‌తో వ్యవసాయంలో మంచి భవిష్యత్తును ఆస్వాదించండి - పంట పొలంలో దమ్ము చూపించడంలో మీతో పాటు నడిచే అల్టిమేట్ పార్ట్‌నర్ - ఈ ట్రాక్టర్.
స్పెసిఫికేషన్లు
మహీంద్రా అర్జున్ 605 DI MS V1 ట్రాక్టర్- ఇంజిన్ పవర్ (kW)36.3 kW (48.7 HP)
- గరిష్ట టార్క్ (Nm)214
- గరిష్ట PTO శక్తి (kW)31.3 (42.0)
- రేట్ చేయబడిన RPM (r/min)2100
- Gears సంఖ్య16F + 4R
- ఇంజిన్ సిలిండర్ల సంఖ్య4
- స్టీరింగ్ రకంపవర్ స్టీరింగ్
- వెనుక టైర్ పరిమాణం429.26 mm x 711.2 mm (16.9 in x 28 in)
- ట్రాన్స్మిషన్ రకంఎఫ్‌సీఎం
- హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)2200 kg (*అడ్జస్ట్‌మెంట్‌లతో కలిపి)
ప్రత్యేక లక్షణాలు
- 2ఎంబీ రివర్సిబుల్ ప్లఫ్
- లోడర్
- డోజర్
- పొటాటో ప్లాంటర్
- సూపర్ సీడర్